Videos
Home >> Latest News >> News

13 లోక్‌సభ సీట్లు టీఆర్‌ఎస్‌కే: టైమ్స్ సర్వే

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీఏ పతనం ఖాయమని సర్వేలు తేలుస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో టైమ్స్ ఆఫ్ ఇండియా లోక్ సభ స్థానాలపై దేశమంతా సర్వే చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా మారనుంది. ప్రస్తుతం 33 స్థానాలున్న కాంగ్రెస్ కు కేవలం 4సీట్లు మాత్రమే రానున్నట్లు సర్వే తేల్చిచెప్పింది. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో ఉద్యమపార్టీ క్లీన్ స్వీప్ చేయనుంది. తెలంగాణలో 13 సీట్లతో టీఆరెఎస్ సత్తా చాటే అవకాశముందని టైమ్స్ సర్వే ఘనాంకాలు చెప్తున్నాయి. అటు సీమాంధ్రలో వైసీపీకి 19 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పింది. అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ 4, 5 సీట్లతో అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి ఉందని సర్వే తేల్చింది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమి ఖాయమని జనాలు తేల్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత 203సీట్లున్న కాంగ్రెస్ కు 107కు పడిపోనుందని సర్వే తేల్చింది. ఇక 115 సీట్లున్న బీజేపీ తన సీట్లను 156కు పెంచుకోనుంది. మిత్రపక్షాలతో కలిపి బీజేపీ 251 సీట్లు గెలుచుకుని అధికారపగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టైమ్స్ సర్వే ప్రకటించింది.

Related News
Photo gallery
Photo gallery
© 2012 Telangana Broadcasting Pvt. Ltd.